మొలకెత్తని సోయాకు పరిహారం | - | Sakshi
Sakshi News home page

మొలకెత్తని సోయాకు పరిహారం

Jul 10 2026 7:52 AM | Updated on Jul 10 2026 7:52 AM

కుభీర్‌: మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఈ ఖరీఫ్‌లో వేసిన సోయా విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇటీవల భైంసాలోని డీలర్ల ఎదుట నిరసన చేపట్టారు. దీంతో డీలర్లు మరుసటి రోజు విత్తనాలకు బదులుగా విత్తనాలు ఇస్తామని తెలిపారు. అయితే తమకు సోయా విత్తనాలకు బదులు డబ్బులు, అలకడానికి అయ్యే ఖర్చు, ఎరువుల ఖర్చు ఇవ్వాలని కుభీర్‌ వివేకానంద చౌరస్తాలో గురువారం ధర్నా చేశారు. సర్‌ పరిశీలనకు వచ్చిన కలెక్టర్‌ భవేశ్‌మిశ్రాను అడ్డుకున్నారు. కలెక్టర్‌ వ్యవసాయ అధికారులు, విత్తన కంపెనీ ప్రతినిదులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులకు సోయా విత్తనాలకు బదులుగా ఎరువులు ఇవ్వాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement