నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jul 5 2026 11:22 PM | Updated on Jul 5 2026 11:22 PM

8లోu సోమవారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2026

న్యూస్‌రీల్‌

బాసర బాలాలయంలో కొలువుదీరిన అమ్మవారు ప్రాణప్రతిష్ట చేసిన శృంగేరి పీఠం పండితులు శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రధాన ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం

జంతు ప్రేమికా.. జాగ్రత్త!

రోజురోజుకూ పెంపుడు జంతువులు పెంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే పెట్స్‌ పెంచుకునే వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

అమ్మవారి సేవ అదృష్టం

బాసర ఆలయ పునర్నిర్మాణ బాధ్యతలు మా కుటుంబానికి దక్కడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా, నాణ్యతలో రాజీ లేకుండా ఆలయ నిర్మాణం చేపడుతున్నాం. రూ.31 కోట్లతో పనులు ప్రారంభించాం. అవసరమైతే మరి ంత వ్యయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. వందల ఏళ్లపాటు నిలిచేలా ఆలయాన్ని ని ర్మించడమే మా లక్ష్యం. నిర్మాణ కాలంలో భ క్తులకు ఇబ్బందులు కలగకుండా బాలాల యంలో దర్శనాలు ఏర్పాటు చేశాం. అమ్మవారి అనుగ్రహంతో మహాకార్యం విజయవంతంగా పూర్తవుతుందని విశ్వసిస్తున్నాం.

– నిర్మాణ దాత

సూరప్పనేని పద్మప్రియ–సునంద్‌

ఆర్టీసీ సేవలు

సద్వినియోగం చేసుకోవాలి

నిర్మల్‌టౌన్‌: ప్రయాణికులు ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్‌ డిపో మేనేజర్‌ పండరి అన్నారు. ప్రయాణికుల కోరిక మేరకు ఆదివారం నిర్మల్‌ బస్టాండ్‌ నుంచి రామేశ్వరానికి ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బస్సు కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పలని, పాతాళశెంభు ,మధురై గుండా రామేశ్వరం వెళ్లి తిరుగు ప్రయాణంలో కంచిపురం, శ్రీకాళహస్తి మీదుగా నిర్మల్‌ చేరుకుంటుందన్నారు. ఈ టూర్‌ మొత్తం ఏడు రోజులు ఉంటుందన్నారు. ఇప్పటికే అనేక పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామన్నారు.

150 రూపాయల అక్షరాభ్యాస మండపంలో ఏర్పాటు చేసిన ముగ్గురు అమ్మవార్ల బాలాలయం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement