
విషజ్వరాల విజృంభణ
ఇంటి పరిసరాల్లో మురుగు గుంతల్లో రసాయన ద్రవాలు పిచికారీ చేసి పరిశుభ్రత పాటించాలి.
పాత ట్యూబ్‌లు, కుండీలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
దోమతెరలను ఉపయోగించాలి.
జ్వర లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి.
చిన్న పిల్లల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి.
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో సీజన ల్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవలి వర్షాలు.. తర్వాత మారిన వాతావరణ పరిస్థితులు, జలాశయాల్లో కొత్తనీరు రాక, దోమల నియంత్రణ లేకపోవడం తదితర కారణా లవో జ్వరబాధితులు పెరుగుతున్నారు. ఇంటికి ఒకరిద్దరు జ్వరంలో బాధపడుతున్నారు. నిర్మల్ ప్రభు త్వ జనరల్ ఆస్పత్రికి వస్తున్నవారిలో జ్వరపీడితులే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులతోపా టు ప్రైవేటు ఆస్పత్రులు కూడా జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. డెంగీ, వైరల్ జ్వరాలు, సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఆస్పత్రికి వస్తున్నారు. పది రోజులుగా జిల్లా ఆస్పత్రిలో నిత్యం ఓపీ 1200 నుంచి 1400 నమోదవుతుంది. ఇన్‌పేషెంట్లుగా 400 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో ముగ్గురు డెంగీ బాధితులు ఉన్నారు. చిన్నారులు, వృద్ధులు జ్వరాలతో ఇన్‌పేషెంట్‌గా చేరుతున్నారు.
ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిట..
ప్రైవేటు ఆస్పత్రులు కూడా జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి జ్వర కేసుల వివరాలు అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ప్రైవేట్ ఆస్పత్రులు ఈ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. రోజువారీ కేసుల వివరాలు అందితే, జ్వర కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సమాచారలోపం కారణంగా వ్యాధుల నియంత్రణలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
వైద్యాధికారుల సూచనలు..
జ్వరాల విజృంభణ నేపథ్యంలో వైద్యాధికా రులు ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను సూచిస్తున్నారు.
పెరుగుతున్న డెంగీ కేసులు..
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తడంతో జిల్లాలో సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా డెంగీ కేసులు పెరిగాయి. వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేలో ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 15 డెంగీ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వైరల్ జ్వరాలు, డయేరియా, మలేరియా, టైఫాయిడ్, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలతో రోగులు ఆస్పత్రులకు చేరుకుంటున్నారు.

విషజ్వరాల విజృంభణ