
న్యూ బొప్పారం వాసికి అవార్డు
సోన్: మండలంలోని న్యూబొప్పారం గ్రామానికి చెందిన చొక్కాల రాజేందర్ రాష్ట్ర ఉత్త మ అధ్యాపక అవార్డును ఆదివారం స్వీకరించా రు. శ్రీవేదాస్ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్‌సార్ 91వ జయంతిని పురస్కరించుకుని ఈ అవార్డు ప్రదానం చేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్ విశ్వకర్మ సంఘ భవనంలో విశిష్ట అతిథులు జస్టిస్ చంద్రకుమార్, బ్రహ్మశ్రీ మోత్కూరి వీరబ్రహ్మయ్య ఐఏఎస్, శ్రీ వేదాస్ రాష్ట్ర అధ్యక్షుడు సింగోజి సంతోష్ కుమార్ అవార్డులు ప్రదానం చేశా రు. రాజేందర్ ప్రస్తుతం గుడిహత్నూర్ కళా శాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.