
భూములు లాక్కోవాలని చూస్తున్నారు..
మేము కడెం మండలం నవాబ్‌పేట్ గ్రామస్తులం. మాకు సర్వే నంబర్ 22లో వ్యవసాయ భూములు ఉన్నాయి. 28 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నాం. దీనిని ఆనుకుని దస్తురాబాద్ శివారు 470 సర్వే నంబర్ ఉంది. ఫారెస్ట్ అధికారులు 470 సర్వే నంబర్‌లో ఈ 22 సర్వే నంబర్ ఉందని మా వ్యవసాయ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రెండు సర్వే నంబర్ల హద్దులో అటవీ శాఖ నిర్మించిన పిల్లర్లు ఉన్నాయి. అయినా వాటిని దాటి వచ్చి మా భూములు లాక్కోవాలని చూస్తున్నారు. మమ్మల్ని భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
– నవాబ్ పేట్ గ్రామస్తులు