
క్రీడలతో ఒత్తిడి నుంచి ఉపశమనం
నిర్మల్‌చైన్‌గేట్: క్రీడలు ఒత్తిడి నుంచి ఉపశమనానికి, శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్ప డతాయని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నా రు. యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన కోర్టును కలెక్టర్ సోమవారం ప్రారంభించా రు. అనంతరం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి కాసేపు టేబుల్ టెన్నిస్ ఆడా రు. తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ కార్యాల య పనిఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఉద్యోగులు, సిబ్బంది విధులు ముగిసి న తర్వాత కోర్టును వినియోగించుకోవాలని సూచించారు. సాధారణ ప్రజల కోసం పట్టణంలో మరిన్ని టేబుల్ టెన్నిస్ కోర్టులను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, సీపీవో జీవరత్నం, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.