
ఆటలాడించాలి..
బడీడు పిల్లలు సెల్‌ఫోన్‌లు, టీవీలకు ఆకర్షితులవుతున్నారు. ఇది వారి శారీరక, మానసిక ఎదుగుదలపైనా ప్రభావం చూపుతోంది. శారీరకంగా ఆడేలా ప్రోత్సహించాలి. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌పై ఆసక్తి పెంచాలి. క్రీడలవైపు పిల్లల మనసు మళ్లిస్తే.. వారు సెల్‌ఫోన్లకు దూరంగా ఉంటారు. చెడు వ్యసనాలకు బానిస కారు. – అన్నపూర్ణ,
ఫిజికల్ డైరెక్టర్, చించోలి(బి) ఉన్నతపాఠశాల
సమయం కేటాయించాలి..
పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. కనీసం పడుకునే ముందైనా వారితో ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. ప్రేమపూరితవాతావరణం లేకపోతే ఇతర అలవాట్లకు బానిసవుతారు. తల్లిదండ్రులే పిల్లలను సెల్‌ఫోన్‌కు బానిసలుగా చేస్తున్నారు. పిల్లలు చూసే ఆన్‌లైన్ గేమ్స్ వారిపై విపరీత ప్రభావం చూపుతుంది.
– డాక్టర్ సురేశ్ అల్లాడి, సైకియాట్రిస్ట్

ఆటలాడించాలి..