
కమీషన్.. పరేషన్!
న్యూస్‌రీల్
డీలర్లకు ఐదు నెలలుగా ఇవ్వని ప్రభుత్వం జిల్లాకు రూ.2.80 కోట్లకుపైగా బకాయిలు విడుదల చేయాలని వేడుకోలు..
నిర్మల్
భక్తిమార్గం.. ఐక్యతా మంత్రం!
గణేశ్ ఉత్సవాలు కేవలం మతపరమైన ఉత్సవం మాత్రమే కాదు. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కోసం బాలగంగాధర్ తిలక్ ఈ ఉత్సవాన్ని ఒక శక్తివంతమైన వేదికగా మలిచారు.
పోలీసులకు ఆరోగ్యం ముఖ్యం
నిర్మల్ టౌన్: శాంతిభద్రతల నిర్వహణ విధులు నిర్వహించే పోలీసులకు ఆరోగ్యం చాలా ముఖ్యమని ఎస్పీ జానకీ షర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ సాయుధ దళ ముఖ్య కార్యాలయంలో శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్ సిబ్బందికి క్రమశిక్షణ, ఫిజికల్ ఫిట్నెస్‌తోపాటు, ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుందన్నారు. సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయాలన్నారు. ఏఎస్పీ రాజేశ్‌మీనా, ఇన్‌స్పెక్టర్లు గోవర్ధన్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్, రవీంద్రనాయక్, మల్లేశ్, కృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్‌చైన్‌గేట్: పేదలకు రేషన్ బియ్యం అందించే డీలర్లు, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ఐదు నెలలుగా కమీషన్ చెల్లించకపోవడంతో వారి జీవనాధారం ప్రశ్నార్థకంగా మారింది. పౌరసరఫరాల సంస్థ నుంచి కమీషన్ డబ్బులు సకాలంలో విడుదల కాక డీలర్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
జిల్లాలో 412 రేషన్ షాపుల ద్వారా 7,54,523 మంది లబ్ధిదారులకు ప్రతినెలా సుమారు 4,428 మెట్రి క్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. క్వింటాల్‌కు రూ.140 కమీషన్‌గా చెల్లించాలి. నెలకు సుమారు రూ.56 లక్షల కమీషన్ డీలర్లకు చెల్లించాలి. అయితే ఏప్రిల్, మే నెలల కమీషన్ డబ్బులు పెండింగ్‌లో ఉండగా, జూన్‌లో మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో మొత్తం ఐదు నెలల కమీషన్ బకాయిలు పేరుకుపోయాయి. కమీషన్ చెల్లింపుల ఆలస్యం వల్ల డీలర్లు షాపు అద్దె, సిబ్బంది జీతాలు, బియ్యం రవాణా, హమాలీ చార్జీలు వంటి ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారు.
మారిన నిబంధనలు..
గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర కమీషన్ డబ్బులు ఒకేసారి చెల్లించేవి. నిబంధనల మార్పులతో విడివిడిగా కమీషన్ చెల్లిస్తున్నాయి. ఈ మార్పు డీలర్లలో అయోమయాన్ని సృష్టిస్తోంది.
అమలు కాని ఎన్నికల హామీలు..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్‌ను క్వింటాకు రూ.70 నుంచి రూ.140కు పెంచగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కమీషన్‌ను రూ.300లకు, అదనంగా డీలర్లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు నెరవేర్చకపోవడంతోపాటు, సకాలంలో కమీషన్ చెల్లింపులు కూడా జరపకపోవడంపై డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం కార్డులు 2,42,205
యూనిట్లు 7,54,523
మొత్తం రేషన్ షాపులు 412
ప్రభుత్వం క్వింటాల్‌కు చెల్లించే
కమీషన్ రూ.140
డీలర్లకు ప్రతినెలా రావాల్సిన కమీషన్‌రూ.56 లక్షలు
పరేడ్ లో పాల్గొన్న మహిళా పోలీసులు

కమీషన్.. పరేషన్!