
ప్రత్యేక అవసరాల పిల్లలపై శ్రద్ధ వహించాలి
నిర్మల్ రూరల్: ప్రత్యేక అవసరాల పిల్లలపై శ్రద్ధ వహించి, వారి ఉన్నతికి పాటుపడాలని జిల్లా విద్యాశాఖ సమన్వయకర్త ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. కొండాపూర్‌లోని ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇంటివద్ద అందించే విద్యను శనివారం పరిశీలించారు. విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందిస్తున్న విద్య, అభ్యసన కార్యక్రమాలను పరిశీలించారు. అభ్యసన కార్యక్రమాల గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. రిసోర్స్ ఉపాధ్యాయులు అందిస్తున్న విధానాన్ని పరిశీలించి అదేవిధంగా మిగతా రోజుల్లో కూడా తల్లిదండ్రులు వారికి తోడ్పాటు అందించాలని సూచించారు. ఇందులో రిసోర్స్ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నిర్మల్ రూరల్: భైంసా పట్టణంలోని బస్తీ దవాఖానలో ఒప్పంద ప్రాతిపదికన వైద్యాధికారి పోస్ట్ భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో రాజేందర్ తెలిపారు. అర్హత ఉన్నవారు దరఖాస్తుఫాం వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, ఈనెల 25న జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో జరిగే ఇంట ర్వ్యూకు హాజరు కావాలని పేర్కొన్నారు.