
పోలీస్ సేవలు ప్రజలకు చేరువ చేసేందుకే గ్రీవెన్స్
భైంసాటౌన్: పోలీసు సేవలను మరింత చేరువ చేసేందుకే ప్రతీ బుధవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. బుధవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం వాటిని పరిశీలించి, సంబంధిత ఎస్‌హెచ్‌వోలతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారానికి సూచనలు చేశారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. అలాగే, కుటుంబ వివాదాల పరి ష్కా రం కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం సత్ఫలితాలిస్తోందని ఎస్పీ తెలిపారు. కుటుంబ తగాదాలతో కౌన్సిలింగ్ కోసం నిర్మల్ వరకు రాలేనివారికి భైంసాలోనే భరోసా కేంద్రం ఏర్పాటు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.