
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
భైంసాటౌన్: రాష్ట్రస్థాయి యోగా పోటీలకు భైంసా పట్టణంలోని శ్రీగౌతమి పాఠశాల విద్యార్థి జీ కేశవ్ ఎన్నికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్ తెలిపారు. తెలంగాణ యోగాసన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పట్టణంలోని గౌతమి హైస్కూల్‌లో నిర్వహించిన ఆరో జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపి రా ష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. సెప్టెంబర్‌లో నిర్మల్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో కేశ వ్ పాల్గొనున్నట్లు యోగా టీచర్ మల్లేశ్ తెలి పారు. ఈమేరకు విద్యార్థిని అభినందించారు.