
వేలం మళ్లీ వాయిదా
సారంగపూర్: అడెల్లి మహాపోచమ్మ వద్ద నిర్వహించే వివిధ వ్యాపారాల నిర్వహణకు దేవాదాయ శాఖ అధికారులు మంగళవారం నిర్వహించాల్సిన వేలం మళ్లీ వాయిదా పడింది. వేలంలో పాల్గొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అధికారులు వాయిదా వేశారు. ఆలయం వద్ద కొబ్బరికాయ ల విక్రయం, ప్యాలాలు పుట్నాల విక్రయం, బొమ్మలు, సీడీలు, కంకణాలు విక్రయించుకునే దుకాణం, టోల్‌ట్యాక్స్ వసూలు, పూలదండల విక్రయం దుకాణాలకు గతనెలలో వేలం నిర్వహించారు. వ్యాపారులు రాకపోవడంతో మంగళవారానికి వాయిదా వేశారు. ఈసారి కూడా వ్యాపారుల నుంచి పెద్దగా స్పందన లేదు. దీంతో ఐదు రకాల వ్యాపారాలకు వేలం వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. సారంగాపూర్‌కు చెందిన రవిచంద్ర అనే వ్యాపారి రూ.1,62,000లకు హెచ్చు పాటపాడి పలు దుకాణాలు దక్కించుకున్నారు. మిగతా వ్యాపారాలకు ఈనెల 18న మళ్లీ వేల నిర్వహిస్తామని ఈవో రమేశ్, ఆలయ కమిటీ చైర్మన్ భోజాగౌడ్ తెలిపారు.