
ట్రిపుల్‌ఐటీలో ఉత్తమ విద్య
బాసర: ఆర్జీయూకేటీ అందించే ఉత్తమ విద్య, ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక వనరులను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. బాసర క్యాంపస్‌లో నూతన విద్యార్థుల తల్లిదండ్రులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అకడమిక్ జ్ఞానంతో పాటు సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధించేందుకు కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులు ప్రతీరోజు కనీసం 5 నిమిషాలు పిల్లలతో మాట్లాడి, వారి విద్యాప్రగతి, మానసిక స్థితి, లక్ష్యాలపై చర్చించాలని సూచించారు. అసోసియేట్ డీన్స్ డా. విటల్, డా. నాగరాజు, డాక్టర్ మహేశ్, శ్రీనివాస్, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.
మెటా గేట్ అకాడమీతో ఒప్పందం
ఆర్జీయూకేటీలోని మెటలర్జీ –మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగం, హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మెటా గేట్ అకాడమీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ సమక్షంలో ఓఎస్డీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ మురళీధర్షన్, మెటా గేట్ అకాడమీ డైరెక్టర్ శ్రీ ఎన్. గురుప్రసాద్ సంతకాలు చేశారు. ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకు గేట్ ఉచిత శిక్షణ అందించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. మెటలర్జీ విభాగాధిపతి శ్రీ కిరణ్ కుమార్, అసోసియేట్ డీన్లు డాక్టర్ మహేశ్, డాక్టర్ విట్టల్, అధ్యాపకులు డాక్టర్ ఆర్.అజయ్, వి.అజయ్ తదితరులు పాల్గొన్నారు.