
వాగు దాటి.. వైద్యం అందించి
నార్నూర్: వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులపై వంతెనలు లేని గ్రామాల వాసులు ప్రమాదకరంగా వాగులు దాటాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాగా సోమవారం గాదిగూడ మండలంలోని ఆర్జుని గ్రామ పంచాయతీ పరిధి మారుగూడ గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు. గ్రామానికి వెళ్లే మార్గం మధ్యలో పెద్దవాగు ఉండగా వైద్య సేవలు అందించేందుకు ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది హెచ్‌ఈ రవీందర్ రాథోడ్, ఏఎన్‌ఎం సులోచన, అరవింద్, గంగాధర్‌లు ప్రమాదకరంగా వాగు దాటారు. దాదాపు కిలోమీటరు కాలినడకన వెళ్లి వైద్యశిబిరం నిర్వహించారు. వారి వెంట ఉపాధ్యాయులు మెస్రం శేఖర్, జాదవ్ జ్యోతి, శ్యావ్‌రావు తదితరులు ఉన్నారు.