
నిర్మల్
న్యూస్‌రీల్
ప్రజలకు మెరుగైన సేవలపై దృష్టి భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్
విజిట్ వీసా.. ఎడారి గోస!
ఉపాధి కోసం జిల్లావాసులు దేశం కాని దేశం వెళ్లి అష్టకష్టాలు పడుతున్నారు. విజిట్ వీసాలపై వెళ్లిన వారి బాధలు వర్ణనాతీతం.
సామాన్యులకు అండగా పోలీసులు
నిర్మల్‌టౌన్: సామాన్యులకు పోలీసులు అండగా ఉండాలని, వారితో స్నేహభావంతో మెలగాలని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల జిల్లా పోలీసులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీ సుల సహాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా సమాచారం ఇవ్వాలని సూచించారు.
సాక్షి : రైతులు భూసమస్యలతో ఇబ్బంది పడుతున్నారు..?
సబ్ కలెక్టర్ : భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోంది. రైతులు ఎవరైనా తమ సమస్యలను తహసీల్దార్‌కు అప్పీల్ చేయవచ్చు. అక్కడ పరిష్కారం కాని పక్షంలో సబ్‌కలెక్టర్ దృష్టికి తేవచ్చు. ఇక్కడా పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారి వద్దకు వెళ్లవచ్చు.
సాక్షి : చెరువులు, కుంటలు ఆక్రమణలపై ఎలా స్పందిస్తారు..?
సబ్ కలెక్టర్ : ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తి లేదు.
భైంసాటౌన్: సమస్యలను సవాల్‌గా స్వీకరించి, ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు వేగంగా చేరువ చేసేలా కృషి చేస్తానని భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్ అన్నారు. భైంసా సబ్ కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు రెవెన్యూ డివిజనల్ అధికారి హోదా ఉండగా, ప్రభుత్వం సబ్ కలెక్టర్ హోదా అధికా రిని కేటా యించడంతో డివిజన్ ప్రజల్లో అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై ఆశలు చిగురించా యి. తమ సమస్యలను నేరుగా సబ్ కలెక్టర్ దృష్టికి తేవడం ద్వారా త్వరగా పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు.
సాక్షి : మీ కుటుంబ నేపథ్యం గురించి..!
సబ్ కలెక్టర్ : మాది మంచిర్యాల జిల్లా దండేపల్లి. అమ్మ సవిత ఇస్రోలో ప్రాజెక్ట్ మేనేజర్. నాన్న హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్. అమ్మానాన్నలకు ఒక్కడినే సంతానం. హైదరాబాద్‌లో పదో తరగతి పూర్తి చేశాను. సైఫాబాద్ బ్రాంచ్‌లో ఫిట్(ఎఫ్‌ఐఐటీ)జేఈఈ 2013లో పూర్తయిన తరువాత, ఢిల్లీ ఐఐటీలో 2017లో బీటెక్ పట్టా తీసుకున్నా. రీసెర్చ్ వైపు ఆసక్తి ఉండడంతో, జపాన్‌లో రీసెర్చింగ్‌లో ఉద్యోగం చేశాను. అది సంతృప్తినివ్వలేదు. అందుకే సివిల్స్ సాధించాలనుకున్నాను. రెండో ప్రయత్నంలోనే ఆలిండియా 35వ ర్యాంకు సాధించాను.
సాక్షి : భైంసాపై అవగాహన ఉందా..? ఇక్కడి సమస్యలను ఎలా తీసుకుంటారు..?
సబ్ కలెక్టర్ : భైంసాలో తరచూ మత ఘర్షణలు జరుగుతాయని విన్నాను. అయితే, నేను వీటి ని సమస్యగా భావించను. వాటిని సవాల్‌గా స్వీకరించి, పరిష్కారానికి కృషి చేస్తాను. అందరూ ఐక్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటా.
సాక్షి : సబ్ కలెక్టర్‌గా ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తారు?
సబ్ కలెక్టర్ : అధికారి హోదా ఏదయినా.. చట్టరీత్యా, నిబంధనలకు అనుగుణంగా సమస్యల పరిష్కారం ఉంటుంది. అయితే, ఐఏఎస్ అధికారి కావడంతో, సమస్యల పరిష్కారంలో కచ్చితత్వం, వేగవంతమైన నిర్ణయాధికారం ఉంటుంది.
సాక్షి : యువతకు మీరిచ్చే సూచనలు..
సబ్ కలెక్టర్ : యువత ఉన్నత చదువుల కోసం, కోచింగ్ కోసం స్థానికంగా వసతులు లేవని నిరుత్సాహ పడొద్దు. అనుకున్న లక్ష్యం కోసం నిరంతరం శ్రమించాలి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అన్ని విషయాలకు సంబంధించి వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ, జీవితంలో ఉన్నత లక్ష్యంవైపు అడుగులు వేయాలి.

నిర్మల్

నిర్మల్

నిర్మల్