
గోడు వినండి.. గోస తీర్చండి..
నిర్మల్‌చైన్‌గేట్: ఏ ఆధారమూ లేదు.. పింఛన్ ఇ ప్పించి ఆదుకోవాలి.. పట్టా అయిన భూమి రికార్డులో తక్కువగా ఉంది.. భూమి ఆక్రమించాలని చూ స్తున్నారు.. ఇందిరమ్మ ఇల్లు ఇస్తలేరు..’ ఇలా పలు సమస్యలపై ప్రజావాణిలో పలువురు తమ గోడు వెల్లబోసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు వివిధ సమస్యలపై 110 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఇతర ఆధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధి కారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి చేయాలి..
ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. అన్ని శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కలకు సంబంధించిన వివరాలను వెంట వెంటనే అప్‌డేట్ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తిచేస్తూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ సర్వేను వేగవంతంగా చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలులోకి వచ్చిన ఉపాధ్యాయుల ఫేషియల్ రికగ్నేషన్ హాజరు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు పాఠశాలలను తనిఖీ చేయాలని సూ చించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్లాట్లకు పట్టాలు ఇప్పించాలి..
మాది లోకేశ్వరం మండలం ఎడ్దూర్. ఎస్సారెస్పీ ముంపు బాధితులం. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్ప టి ప్రభుత్వం మాకు కోమల్‌కోట్ పునరావాస గ్రా మంలో ఇళ్ల స్థలాలు కేటాయించింది. అయితే ప్లా ట్లకు పట్టాలు ఇవ్వలేదు. ఇప్పటికై నా ఇప్పించాలి.
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. పింఛన్ రూ.6016కు పెంచి ఇవ్వాలి. అర్హులైన దివ్యాంగులకు బ్యాక్‌లాక్ పోస్టుల్లో ఉద్యోగాలు ఇప్పించాలి. ట్రై సైకిళ్లు, బ్యాటరీ సైకిల్ అందజేయాలి.
– దివ్యాంగుల హక్కుల పోరాట సమితి
పాత పద్ధతిలోనే టెండర్..
గురుకులాల్లో పాత టెండర్ విధానం కొనసాగించాలి. మహిళా సంఘాలు యువజన సమాఖ్యలకు టెండర్ ప్రక్రియలో భాగస్వామ్యాన్ని విరమించుకోవాలి. ఈఎండీ సెక్యూరిటీ విధానంలో వెసులుబాటు కల్పించాలి. లేదంటే ఈనెల 14 నుంచి విద్యాలయాలకు ఆహార పదార్థాల సరఫరా, పండ్లు, గుడ్లు, మాంసం సప్లై నిలిపివేస్తాం. – తెలంగాణ గురుకుల
కాంట్రాక్ అసోసియేషన్ సభ్యులు
ప్రజావాణిలో అర్జీ స్వీకరించి బాధితుల గోడు వింటున్న కలెక్టర్ అభిలాష అభినవ్

గోడు వినండి.. గోస తీర్చండి..

గోడు వినండి.. గోస తీర్చండి..

గోడు వినండి.. గోస తీర్చండి..