
బేస్ బాల్ ఎంపిక పోటీలు
నిర్మల్ టౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాస్థాయి సీనియర్ బాల, బాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో ప్రతిభ కనబర్చినవారు ఆదిలాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా సెక్రెటరీ రవీందర్‌గౌడ్ తెలిపారు. ఇందులో స్కూల్ గేమ్స్ మాజీ సెక్రటరీ రమణారావు, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.శ్రీనివాస్, ఆర్గనైజర్ సంజీవ్, సంజు రాథోడ్, సుష్మిత, సాయిరాజ్, హన్మాండ్లు, సునీత తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలు..
జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాస్థాయి అండర్– 13 బాల, బాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. స్కూల్ గేమ్స్ జిల్లా సెక్రెటరీ రవీందర్‌గౌడ్ పోటీలను పర్యవేక్షించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ సెక్రెటరీ అన్నపూర్ణ, వ్యాయా మ ఉపాధ్యాయులు ఎం.శ్రీనివాస్, ఆర్గనైజర్ సంజీవ్, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బేస్ బాల్ ఎంపిక పోటీలు