
నిషేధిత జాబితా నుంచి తొలగించాలి..
మాది మామడ మండలం కొరటికల్ గ్రామం. సర్వే నంబర్ 1096లో 22 గుంటల భూ మి మా అమ్మగారి పేరు మీద ఉంది. ఈ భూమిని నా పేరు మీద మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఈ భూమి నిషేధిత జాబితాలో ఉందని అధికారులు చెబుతున్నారు. నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ అయ్యేలా చూడాలి.
– జంగం గంగవ్వ, కొరిటికల్
ఉద్యోగం ఇప్పించాలి..
మాది పెంబి మండలం పెంబి తండా. జీఎన్‌ఎమ్ కోర్సు చేసి ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నాను.పెంబి ప్రాథమి క ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌న ర్స్ పోస్ట్ ఖాళీగా ఉంది. నేను ఈ పోస్టుకు అర్హుడను. దయతలచి ఈ పోస్టు ఇ ప్పించగలరు.
– అంగోత్ దయాకర్, పెంబి తండా
బ్యాటరీ సైకిల్ ఇప్పించాలి..
నేను నర్సాపూర్(జి) మండలం రాంపూర్‌కు చెందిన దివ్యాంగుడిని. 15 ఏళ్ల క్రితం ఇన్ఫెక్షన్‌తో నా కాలు తొలగించారు. గతంలో అలింకో కంపెనీ ద్వారా నేను వీల్‌చైర్‌ను పొందాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగాలేదు. బ్యాటరీ సైకిల్ ఇప్పించగలరు.
– కొండ రాజన్న, రాంపూర్

నిషేధిత జాబితా నుంచి తొలగించాలి..

నిషేధిత జాబితా నుంచి తొలగించాలి..