
అర్హుల జాబితా నుంచి తొలగించారు
నిర్మల్ రాంరావ్‌బాగ్‌లో నివాసం ఉంటున్నాం. మా అమ్మ సామోజి అంజలి పేరు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇప్పుడు ఇంటి నిర్మాణం చేపడదామనుకుంటే.. అధికారులు అర్హుల జాబితాలో మా పేరు లేదంటున్నారు.
– సాయి కృష్ణ, రాంరావ్ బాగ్
విద్యుత్ తీగలు సరిచేయాలి..
నేను జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ కాలనీవాసిని. మా కాలనీలోని పాత ఎస్‌ఆర్‌కే స్కూల్ భవనం ముందు విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. వినాయక చవితి దృష్టిలో ఉంచుకుని విద్యుత్ తీగలు సరిచేయాలి.
– అంబేకర్ వరప్రసాద్, గాంధీనగర్
నా భర్త మృతదేహం
తెప్పించండి..
నాది దస్తురాబాద్ మండలం మున్యాల్. ఉపాధి నిమిత్తం నా భర్త సంగ సురేశ్(33) ఏజెంట్‌కు 2.50 లక్షల రూపాయలు చెల్లించి ఉజ్బెకిస్తాన్ వెళ్లాడు. అనారోగ్య కారణంగా జూలై 21న మరణించాడు. 22 రోజులు అవుతున్న మృతదేహం రాలేదు. మీరైనా తెప్పించండి.
– సంగ మమత, మున్యాల్

అర్హుల జాబితా నుంచి తొలగించారు

అర్హుల జాబితా నుంచి తొలగించారు