
దేశాన్ని, ధర్మాన్ని రక్షించాలి
● ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ కార్యవాహ దిగంబర్
కుభీర్: దేశం, ధర్మ రక్షణలో అందరూ భాగస్వాములు కావాలని ఆర్‌ఎస్‌ఎస్ నాలుగు జిల్లాల కార్యవాహ రాజుల దిగంబర్ అన్నారు. కుభీర్ శ్రీవిఠలేశ్వర మందిరంలో శనివారం నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో మాట్లాడారు. హిందువులలో ఐక్యత లేని కారణంగా మన దేశాన్ని 800 సంవత్సరాలు మొఘలులు, 200 ఏళ్లు బ్రిటిషర్లు పాలించారన్నా రు. హిందువులలో ఐక్యత కోసం 1925లో డాక్టర్ కేశవ్‌రావ్ బలిరాంపంత్ హెడ్గేవార్ ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించారన్నారు. పర్యావరణ రక్షణకు అందరూ మొక్కలు నాటాలన్నారు. కులతత్వం విడనాడి అందరూ సమానమేననే భావనతో మెలగాలన్నారు. స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేస్తూ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. అనంతరం స్వయంసేవకులు రాఖీలు కట్టుకున్నారు. అర్గుల సాయినాథ్, డాక్టర్ పెంటాజీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు పోషెట్టి, శ్రీనివాస్, శివలింగు, హన్మాండ్లు, రాజు, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.