ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

Aug 10 2025 8:07 AM | Updated on Aug 10 2025 8:07 AM

ఘనంగా

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

నిర్మల్‌చైన్‌గేట్‌: ఆదివాసీ యోధుల స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆదివాసీ నాయకపోడ్‌ ఉద్యోగ సంఘం, నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు ముచ్చిండ్ల రవికుమార్‌, ప్రధాన కార్యదర్శి అనుగొండ సతీశ్‌ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ వీరులు కుమురంభీం, రాంజీగోండు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసుల ఆత్మగౌరవం, సంస్కృతి, హక్కుల పరిరక్షణ కోసం సంఘం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలోనాయక పోడ్‌ ఉద్యోగ సంఘ సభ్యులు కస్తూరి భీమేశ్వర్‌, సొండి శివశంకర్‌, బాపయ్య, గుండంపల్లి సాయన్న, గురుడు సునీల్‌, పోశెట్టి ముత్తన్న, బాలాజీ, గంపల భూమేష్‌, రాజేశ్వర్‌, కాల శంకర్‌, పిరాజి పాల్గొన్నారు.

ఆదివాసీ యోధుల స్ఫూర్తితో ..

నిర్మల్‌ టౌన్‌: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ జేఏసీ కన్వీనర్‌ మంద మల్లేశ్‌, తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకయ్యగారి భూమయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆది వాసీల హక్కులను కాపాడాలని, వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్థానిక టీఎన్జీవో భవనం నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా, కుమురంభీం, రాంజీగోండు విగ్రహాల వరకు సాగింది. విగ్రహాలకు పాలాభిషేకం చేసి, జెండాలు ఆవిష్కరించారు. అనంతరం టీఎన్జీవో భవనంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఆదివాసీ మ్యూజియం ఏర్పాటు చేయాలని, ఆదివాసీ విద్యార్థుల కోసం ప్రత్యేక కోచింగ్‌ సెంటర్‌ ప్రారంభించాలని కోరారు. దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన పట్టాలపై సాగు చేసుకులా ఆదివాసీలకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మారుమూల గూడేలకు రోడ్డు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆదివాసీ దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ నాయకులు శంభు, నైత భీమ్‌రావు, తోడుసం గోవర్ధన్‌, సుంచు శ్రీనివాస్‌, సాకి లక్ష్మణ్‌, సూరపు సాయన్న, నాయకపోడు సంఘం అధ్యక్షుడు శంకర్‌, ఆదివాసి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవి, కార్యదర్శి సతీశ్‌, ఎల్లయ్య, పోతురాజ్‌ శ్రీనివాస్‌, భీమేశ్‌, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 1
1/1

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement