
కుంటాలలో భారీ వర్షం
కుంటాల: మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం వేకువ జామున భారీ వర్షం కురిసింది. వా గులు ఉప్పొంగాయి. చేలల్లో నీరు నిలిచింది. పత్తి, సోయా పంటలు నీట మునిగాయి. సూర్యాపూర్ నుంచి కల్లూరు వాగు పక్కనున్న పంటల్లో వరద నిలిచి పంటలు దెబ్బ తిన్నట్లు రైతులు తెలిపారు. మండలంలో 51.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు ఏఎస్‌వో సాయి కృష్ణ తెలిపారు.
నిలిచిన రాకపోకలు
మండలంలో కురిసిన వర్షంతోపాటు మహారాష్ట్రలో కూడా వర్షం కురవడంతో సూర్యాపూర్ చెరువు నిండిపోవడంతో పాత వెంకూర్ లోలెవల్ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహించింది. దీంతో పాత వెంకూర్–కొత్త వెంకూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాత వెంకూర్ గ్రామస్తులు కుంటాలకు ఓలా మీదుగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తహసీల్దార్ కమల్‌సింగ్, ఎస్సై అశోక్ పరిస్థితిని సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేశారు.

కుంటాలలో భారీ వర్షం