
బాధ్యతలు స్వీకరించిన భైంసా సబ్ కలెక్టర్
భైంసాటౌన్/బాసర/నిర్మల్‌చైన్‌గేట్: భైంసా సబ్ కలెక్టర్‌గా అజ్మీరా సంకేత్‌కుమార్ గురువారం బా ధ్యతలు స్వీకరించారు. ఉదయం ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. పదోన్నతిపై బదిలీ అయిన ఆర్డీవో కోమల్‌రెడ్డితోపాటు కార్యాలయ ఉద్యోగులు, తహసీల్దార్లు, సిబ్బంది, ఉద్యోగ సంఘాల నా యకులు ఆయనకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలి కారు. సంకేత్‌కుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యాలయ ఉద్యోగులను పరిచ యం చేసుకున్నారు. అనంతరం ట్రెసా నాయకులు సబ్‌కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. తర్వాత సబ్ కలెక్టర్ బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అర్చకులు ఆయనకు స్వాగ తం పలికారు. ప్రత్యేక పూజలు చేయించారు. తర్వా త హారతి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం నిర్మల్ చేరుకున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్‌ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భైంసా డివిజన్ స్థితిగతులపై చర్చించారు.