
ఉపాధ్యాయులు సాంకేతికతను వినియోగించుకోవాలి
నిర్మల్ రూరల్: రోజురోజుకూ సాంకేతిక విప్లవం మెరుగవుతున్నందున, ఉపాధ్యాయులు కూడా సాంకేతికతను ఉపయోగించుకుని విద్యార్థులకు పాఠాలు బోధించాలని డీఈవో రామారావు సూచించారు. జిల్లా కేంద్రంలోని జుమ్మెరత్‌పేట్ హైస్కూల్‌లో ఉల్లాస్ (నవభారత్ సాక్షరతా కార్యక్రమం)పై ఉపాధ్యాయులకు గురువారం ఒకరోజు శిక్షణ అందించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఈవో మా ట్లాడారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఆయా గ్రామాలలో స్వయం సహా య బృందాలతో మమేకమై ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు. శిక్షణలో వయోజన విద్య అధికారి తిరుపతిరావు, నరసయ్య, ప్రవీణ్‌కుమార్, ప్రధానోపాధ్యాయులు రవిబాబు, రిసోర్స్‌పర్సన్‌లు నాగుల రవి, శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.