
‘ఆదివాసీ మ్యూజియం’ మాయం..
సోషియాలజీ డిపార్ట్‌మెంట్‌కు అనుసంధానంగా నిర్మల్ పీజీ సెంటర్‌లోనే ఆదివాసీ మ్యూజియం ఏర్పాటు చేశారు. అప్పటి అధ్యాపకులు, విద్యార్థులు తీవ్రంగా శ్రమించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీల గూడేలకు వెళ్లి.. వారి సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడమే కాకుండా వారి పనిముట్లు, ఆభరణాలు, ఫొటోలను, వస్తువులను సేకరించారు. అప్పట్లో ఉన్న కేయూ వీసీ వచ్చి ఈ మ్యూజియం ప్రారంభించారు. దీని నిర్వహణకు ఏడాదికి రూ.50 వేల చొప్పున ఫండ్ ఇచ్చేవారు. అలాంటి అరుదైన ఆదివాసీ మ్యూజియాన్ని ఇప్పుడు కనుమరుగు చేశారు. అప్పటి వస్తుసంపద కూడా మాయమైంది. ఇచ్చిన నిధులకూ లెక్కలేదు. మ్యూజియంలోనే కాదు.. పీజీ సెంటర్‌లోని లైబ్రరీ పేరిట కూడా నిధులు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

‘ఆదివాసీ మ్యూజియం’ మాయం..