
భూమి కొలిచి హద్దులు చూపించాలి..
నాకు సారంగాపూర్ మండలం చించోలి(బి)లో 169/24 లో ఎకరం 24 గుంటల భూమి ఉంది. నా భూమి నాకు కొలిచి హద్దులు చూపించాలని చలాన్ కట్టాను. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు.
– ముక్కెర లక్ష్మి, చించోలి(బి)
డబుల్ ఇళ్లు అప్పగించాలి..
మేము రాంనగర్ ఆసరా కాలనీవాసులం. సిద్దాపూర్ సమీపంలో నిర్మించిన డబల్ బెడ్‌రూమ్ ఇళ్లలో రాంనగర్ వార్డు నంబర్ 16కు 107, ఆసరా కాలనీకి 109 మంజూరు చేశారు. కానీ నేటికీ నిర్మాణం పూర్తికాక పంపిణీ చేయలేదు. అధికారులు స్పందించి ఇళ్లు అప్పగించాలి.
– రాంనగర్, ఆసరా కాలనీవాసులు
ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా అందించాలి..
నేను లంబా డా తెగకు చెందిన వాడను. జీవనోపాధి కి భూమి లేదు. లక్ష్మీసాగర్ శివారులో సర్వే నంబర్ 92లో కంపార్ట్‌మెంట్ 848 లో 8 ఎకరాల భూమి చదును చేసుకుని 20 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నా. 2022లో అధికారులు సర్వే చేశారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ సర్వేలో నా పేరు నమోదు చేశారు. కానీ పట్టా ఇవ్వలేదు. – భూక్య రాజేశ్, లక్ష్మీసాగర్

భూమి కొలిచి హద్దులు చూపించాలి..