
పరిహారం అందించాలి
నా భర్త అడెళ్లు 2023, మే 10న మరణించాడు. నాకు 15 ఏళ్ల బాబు ఉన్నాడు. నా జీవితానికి ఏ ఆధారం లేదు. జాతీయ కుటుంబ ప్రయోజనా పథకం ద్వారా సహాయం అందించాలి.
– రాచర్ల సరిత, భాగ్యనగర్
స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి..
పట్టణంలోని గాజులపేట్–వెంగ్వాపేట రోడ్డులో ఓ ప్రైవేట్ పాఠశాల ఉంది. అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. స్పీడ్ బ్రేకర్లు వేయించాలి.
– షరీఫ్ బిన్ ఆది, జాతీయ మానవ హక్కుల కమిషన్ జిల్లా ఉపాధ్యక్షుడు
శ్మశాన వాటిక ఆక్రమణ ఆపాలి..
మేము ముధోల్ గ్రామస్తులం. మా ఊరిలో సర్వే నంబర్ 6లో ప్రభుత్వ స్థలంలో శ్మశాన వాటిక ఉంది. అక్కడ కొందరు దుకాణాలు ఏర్పాటు చేసి ఆక్రమణకు పాల్పడుతున్నారు. ఆక్రమణదారుల నుంచి శ్మశానవాటిక స్థలాన్ని కాపాడాలి.
– ముధోల్ గ్రామ ప్రజలు

పరిహారం అందించాలి