
ఉద్యమకారుల సమస్యలపై వినతి
ఖానాపూర్: తెలంగాణ ఉద్యమ సమయంలో పోరా టాలు చేసిన వారికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇళ్లతోపాటు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకా రుల ఫోరం రాష్ట్ర వైస్‌చైర్మన్ పాకాల రాంచందర్ కో రారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనహిత పాదయాత్రకు వచ్చిన ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తోపాటు టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఆదివారం రాత్రి వినతిపత్రం అందజేశారు. ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీ మంత్రి ఐకే.రెడ్డి ఉన్నారు.