
వైభవంగా సుదర్శన యాగం
నిర్మల్‌టౌన్: శ్రావణమాసాన్ని పురస్కరించుకు ని జిల్లా కేంద్రంలోని బాలాజీవాడలోగల అలి వేలుమంగ ఆలయంలో ఆదివారం సుదర్శన యాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించా రు. లోక కల్యాణం, భక్తుల శ్రేయస్సును కాంక్షిస్తూ టీకే రామ కన్నన్ ఆధ్వర్యంలో నిర్వహించి న ఈ యాగం భక్తి పారవశ్యాన్ని కలిగించింది. వేద పండితులు శాస్త్రోక్తంగా హోమ క్రతువు నిర్వహించారు. యాగం అనంతరం, భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్ర మంలో లక్కడి జగన్మోహన్‌రెడ్డి, ఆమెడ శ్రీధర్, డాక్టర్ ప్రవీణ్, గంధం సుధాకర్, పూసల శ్రీకాంత్, అనిల్ ధనానివల, గోనె రాజు, పాతికే రమేశ్, రాజశేఖర్, శ్రీహరి, శేఖర్, పద్మ, ఏ విజయలక్ష్మి, భక్తులు పాల్గొన్నారు.