
యాత్రీకులకు ప్రత్యేక బస్సులు
కుంటాల: యాత్రికులు దైవదర్శనానికి వెళ్లేందు కు ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు భైంసా డీఎం హరిప్రసాద్ తెలిపా రు. కుంటాల నుంచి మహారాష్ట్రలోని పండరీపూర్, మహదేవ్, తుల్జాభవాని ఆలయాలకు వెళ్లే ప్రత్యేక సర్వీస్‌ను ఆదివారం కుంటాలలో ప్రారంభించారు. ఒక్కొక్కరికి రూ. 2,600 చా ర్జీ ఉంటుందని తెలిపారు. యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ భగవంత్‌రావు, వీబీవో శ్రీనివాస్, సిబ్బంది భూమ న్న, విశ్వనాథ్, వెంకట్‌రావు పాల్గొన్నారు.