
బందోబస్తుపై ఎస్పీ సమీక్ష
ఖానాపూర్: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చా ర్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మ హేశ్‌కుమార్‌గౌడ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ పా ల్గొనే జనహిత పాదయాత్ర బందోబస్తు విషయమై ఆదివారం పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్‌హాల్‌లో పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ జానకీ షర్మిల సమీక్షించారు. ఏఎస్పీలు ఉపేంద్రరెడ్డి, అవినాష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ, తదితర అంశాలపై సూచనలు చేశారు. రెండురోజులు నిర్వహించే కార్యక్రమంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని సూచించారు. సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.