
పాత పెన్షన్ అమలు చేయాలి
నిర్మల్ రూరల్: 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పా త పెన్షన్‌ను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ లచ్చిరాం కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ప్రమోషన్‌కు అర్హత గల ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు పరిశీలించాకే సీనియారిటీ జాబితా రూపొందించాలని పేర్కొన్నారు. ఉ పాధ్యాయ, విద్యారంగ సమస్యలపై అవగాహన క లిగి, బీఈడీ కలిగిన వారినే డీఈవోలుగా నియమించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలల బ లోపేతానికి 5,571 పీఎస్ హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేసి, ఇదే కౌన్సిలింగ్‌లో భర్తీ చేయాలని కోరా రు. మ్యూచువల్ బదిలీ పొందిన ఉపాధ్యాయుల సీనియార్టీని పరిగణనలోకి తీసుకుని సీనియార్టీ జా బితాలో చేర్చాలన్నారు. ప్రమోషన్ల ప్రక్రియ ముగి సేదాకా ఉపాధ్యాయుల సర్దుబాటును తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. వెంటనే ఈహెచ్‌ఎస్‌ను అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయు ల జీపీఎఫ్, ఇతర పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిపడ్డ ఐదు డీఏలు వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చే యాలన్నారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చే యడానికి తక్షణమే ఆదేశాలు జారీ చేయాలన్నారు. స్థానికత ప్రాతిపదికగా జీవో 317 బాధిత టీచర్లకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ము రళీమనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రఘునందన్‌రెడ్డి, సహాధ్యక్షులు సుజాత, లక్ష్మీప్రసాద్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి శరత్‌చందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవికాంత్, వివిధ జిల్లాల బాధ్యులు శ్రీకాంత్, జలంధర్‌రెడ్డి, సత్తయ్య, రవీందర్, శ్రీనివాస్, భీమ్‌రావు, రాజేశ్వర్, తిరుపతి తదితరులున్నారు.