
ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే లక్ష్యం
తానూరు: రైతుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే లక్ష్యమని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి అంబిర్ ఆనంద్‌రావ్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని కల్యాణ మండపంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని ఆయా మండలాల్లో రైతు కమిటీల ఏర్పాటు అనంతరం జిల్లా కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. సమస్యలపై పోరాడేందుకు రైతులంతా సంఘటితం కావాల్సిన అవసరముందని పేర్కొన్నా రు. తానూరు మండలంలో విద్యుత్ సమస్యలు పరి ష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని, గోదావరి నది మనవద్ద ఉంటే మన వ్యవసాయ పొలాలకు చుక్క నీరు అందడం లేదని తెలిపారు. అనంతరం మండల సంఘ్ కమి టీని ఎన్నుకోగా అధ్యక్షుడిగా బాయి జగన్, ఉపాధ్యక్షుడిగా కంచర్ల రవీందర్‌రెడ్డి, కార్యదర్శిగా పున్నోడు సాయినాథ్, సహ కార్యదర్శిగా బయ్యవాడ్ కిరణ్, కార్యవర్గ సభ్యులుగా శివరాత్రి ఆనంద్, మారుగొండ రాములు, దార్మూడ్ రాములు, కదాం దేవరావు, కంచెర్ల సంజీవరెడ్డిని ఎన్నుకున్నారు.