
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
లక్ష్మణచాంద: మండలంలోని వడ్యాల్ గ్రా మంలోని వివిధ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగా గ్రామస్తులు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ, డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు నరేశ్‌రెడ్డి, నారాగౌడ్, కిరణ్ ఠాకూర్, పోతారెడ్డి, అజార్ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
లక్ష్మణచాంద: మండలంలోని మునిపెల్లి గ్రా మ పంచాయతీ కార్యదర్శి భాగ్య సస్పెండ్ అయ్యారు. 10 రోజుల నుంచి ఒకే ఫొటోను ఫేస్ రికగ్నిషన్ యాప్‌లో అప్‌లోడ్ చేయడంతో ఆమెను కలెక్టర్ అభిలాష అభినవ్ సస్పెండ్ చేశారు. కాగా, మల్లాపూర్ పంచాయతీ కార్యదర్శి చైతన్యకు మునిపల్లి ఇన్‌చార్జి కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినట్లు ఎంపీడీవో రాధ తెలిపారు.