
పాదయాత్ర రూట్‌మ్యాప్ పరిశీలన
ఖానాపూర్: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చేపట్టిన జనహిత పాదయాత్ర ఆదివారం జిల్లాకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో రూట్‌మ్యాప్‌ను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు శనివారం పరిశీలించారు. ఖానాపూర్ మండలం బాదనకుర్తి గ్రామంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే పాదయాత్ర సుర్జాపూర్, మస్కాపూర్ గ్రామాల మీదుగా ఖానాపూర్ పట్టణం వరకు సాగుతుంది. రాత్రి 9 గంటలకు పట్టణంలోని జేకే ఫంక్షన్‌హాల్‌లో నైట్‌హాల్ట్ ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం ఖానాపూర్‌లోని బస్టాండ్, ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంతాల్లో శ్రమదానం ఉంటుందన్నారు. అనంతరం జేకే ఫంక్షన్‌హాల్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివచ్చి జనహిత పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు.
సుజ్జాపూర్‌లో విద్యార్థులతో వెడ్మబొజ్జు, శ్రీహరిరావు