
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు గురుకుల విద్యార్థులు
తానూరు(ముథోల్): ముధోల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్‌లోని జవహర్‌లాల్ నెహ్రు స్టేడియంలో 3వ తేదీ నుంచి జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో వి.సిద్ధార్థ 200 మీటర్లు, కె.సాయిరాం 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటారని ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి తెలిపారు. విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు సంజీవ్, దేవోజి శ్రీకాంత్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.