
పేరు తెచ్చిన పెంబి..
● ఉత్తమ ఫలితాలు సాధించిన పెంబి బ్లాక్ ● సంపూర్ణత అభియాన్‌తో పలుమార్పులు ● ఏబీపీలో జాతీయర్యాంకు ● గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్
జాతీయస్థాయిలో నాల్గోస్థానం..
ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం(ఏబీపీ) ప్రధాన ఉద్దేశమైన వెనుకబడిన ప్రాంతాల్లో వివిధ అంశాల్లో మార్పు తీసుకురావడం అనేది పెంబి మండలం కనిపించడంపై నీతిఆయోగ్ సంతృప్తి వ్యక్తంచేసింది. ఏబీపీ కార్యక్రమ అమలు తీరుపై నీతిఆయోగ్ నెలవారీగా డెల్టా ర్యాంకింగ్ ప్రకటించింది. ఇందులో దేశంలోని మొత్తం 500 బ్లాకులలో మెరుగైన ఫలితాలతో పెంబి బ్లాక్ జాతీయస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించింది.
నిర్మల్/పెంబి: పెంబి.. చుట్టూ దట్టమైన అడవుల మధ్య కనీసం సరైన తోవ కూడా లేని ఊళ్లతో, ఇప్పటికీ కరెంటును చూడని పల్లెలతో, అ భివృద్ధి అనే పదానికి అర్థం కూడా తెలియని గూడేలతో ఉన్న మండలం. అలాంటి మండల మే ఇప్పుడు జిల్లాకు పేరు తీసుకొచ్చింది. నిర్మ ల్ కీర్తిని జాతీయస్థాయిలో నిలబెట్టింది. కేంద్ర ప్రభుత్వం నీతిఆయోగ్ ద్వారా చేపట్టిన ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్(ఆకాంక్షత జిల్లాల కార్యక్రమం)ద్వారా చేపట్టిన కార్యక్రమాల్లో పెంబి మండలం ఉత్తమ ప్రగతిని సాధించింది. గతేడాది డిసెంబర్‌లో ప్రకటించిన ర్యాంకుల్లో జా తీయస్థాయి నాల్గోస్థానంలో నిలిచింది. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా కలెక్టర్ అభిలాషఅభినవ్ శనివారం పురస్కారం అందుకున్నారు.
ఆకాంక్షత బ్లాక్‌గా ఎంపికై ..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం 2018 జనవరిలో నీతిఆయోగ్ ద్వారా ఆస్పిరేషనల్(ఆకాంక్షత) డిస్ట్రిక్ట్స్(బ్లాక్) ప్రోగ్రామ్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా గుర్తించిన 112 అత్యంత వెనుకబడిన జిల్లాలను త్వరగా, సమర్థవంతంగా మార్చడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఆయా జిల్లాల్లోనే వెనుకబడిన బ్లాక్(మండలాల)ల్లో ప్రజల ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, జల వనరులు, ఆర్థికాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు తదితర సామాజిక, ఆర్థిక అంశాలలో పురోగతి సాధించాలన్న లక్ష్యంతో చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వెనుకబడిన మండలంగా పేరున్న పెంబి ఎంపికై ంది.
పలు అంశాల్లో మార్పు...
ప్రోగ్రాంలో భాగంగా ఆరు అంశాలపై సంపూర్ణత అభియాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం జూలై 6, 2024న పెంబి బ్లాక్‌లో ప్రారంభించారు. నిరంతర పర్యవేక్షణ, కమ్యూనిటీ భాగస్వామ్యంతో సెప్టెంబర్ 31, 2024 వరకు కొనసాగింది. ఈ త్రైమాసిక కార్యక్రమాలతో పలు అంశాల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. ప్రధానంగా ఆరు సూచికల్లో పరిశీలన చేపట్టగా, నాలుగింటిలో సంతృప్తకరమైన ఫలితాలు వచ్చాయి. ఆరోగ్యపరంగా మధుమేహం, రక్తపోటు, సప్లిమెంటరీ న్యూట్రిషన్‌లతోపాటు, భూసార పరీక్షలు, గర్భిణులకు సంబంధించిన పరీక్షలు, ఎస్‌హెచ్‌జీ రివాల్వింగ్ ఫండ్ కవరేజీ అంశాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి.
చేయాల్సినవెన్నో..
అత్యంత వెనుకబడిన ప్రాంతంగా కేంద్రమే గుర్తించిన పెంబి మండలంలో ఏబీపీ ద్వారా ఆరోగ్యం, పోషకాహారం తదితర అంశాల్లో కొంత మార్పు కనిపిస్తోంది. ప్రధానంగా ఇక్కడి ఆదివాసీ మహిళల్లో రక్తహీనత, పోషకాహారలోపం ఎక్కువ. ఈకారణంగానే గర్భస్థ శిశుమరణాల సంఖ్య ఉంటోంది. ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమం వీటిలో మార్పు కనిపిస్తున్నా.. ఇప్పటికీ ఆ మండలంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా చాకిరేవు వంటి చాలా గ్రామాలకు ఇప్పటికీ రోడ్లు, కరెంటు లేదు. చాలా ఊళ్లు సరైన తాగునీటికి నోచుకోవడం లేదు. వర్షాకాలం వాగులు పొంగితే రాకపోకలకూ ఇబ్బందే. తాజాగా జాతీయస్థాయిలో జిల్లాకు గుర్తింపు తెచ్చిన పెంబి మండలంపై ఇప్పటికై నా ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
సంపూర్ణ అభియాన్‌తో మార్పులు..
అంశం అభియాన్‌కు అభియాన్
ముందు(శాతం) తర్వాత(శాతం)
గర్భిణులకు పరీక్షలు 90 100
మధుమేహ పరీక్షలు 35 100
రక్తపోటు పరీక్షలు 35 100
పోషకాహారం 68 100
భూసారపరీక్షలు 00 69.39
రివాల్వింగ్ ఫండ్ కవరేజీ 54 94.6