
స్నేహమే జీవితానికి వెన్నెల
● దోస్తానా మాధుర్యం అనిర్వచనీయం ● మైత్రీబంధానికున్న ప్రాధాన్యత ప్రత్యేకం
ఈ ఫొటోలోని ముగ్గురు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. ఇంటర్ చదువుకునే రోజుల్లో వీరిమధ్య ఏర్పడిన స్నేహం బలపడింది. ప్రస్తుతం ముగ్గురూ బోధనా వృత్తిలో ఉన్నారు. ఇద్దరు డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో ఉండగా, మరొకరు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్. వీరి 16వ ప్రాయంలో ఏర్పడిన స్నేహబంధం దృఢపడుతూ వస్తోంది. తమ స్నేహ బంధంతో యువతకు స్ఫూర్తిగా నిలిచారు. కటకం మురళి, యూ.రవికుమార్, కందూరి శంకర్. దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వీరు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకున్నారు. ఒకరి తడి కంటిని మరొకరు తుడిచి ధైర్యం పంచుకున్నారు. చివరకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. అక్కడితో ఆగకుండా జూనియర్ అధ్యాపకులుగా, డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం నిర్మల్‌లో స్థిరపడినవీరు.. ఇప్పటికీ ప్రతి సందర్భంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ సలహాలు సూచనలు ఒకరికొకరు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరి మైత్రిబంధం నిజమైన స్నేహానికి స్ఫూర్తి.
నిర్మల్‌ఖిల్లా: కష్టసుఖాల్లో కలిమీలేమీల్లో.. నీ కోసం నేనున్నాను.. అని భుజం తట్టే ఆత్మీయమైన స్పర్శ స్నేహం. ఈ మైత్రీబంధం ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. విషాదాన్ని తగ్గిస్తుంది. ఆత్మీయమైన స్నేహా లు, ఉన్నతమైన మానవతా విలువలు నిశీధి లో ఉషోదయంలా దారి చూపుతూనే ఉన్నా యి. చిన్నప్పుడు...బుడి బుడి అడుగుల బాల్యంలోనే అల్లుకునే స్నేహ బంధాలు కొన్నయితే.. పరవళ్లు తొక్కే యవ్వనంలో పెనవేసుకునే అనుబంధాలు మరికొన్ని.. ఈ బంధం నిజంగానే జీవితానికి వెలుగునిస్తుంది.
స్ఫూర్తి కెరటాలు..