
ఖానాపూర్‌లో బంద్ సంపూర్ణం
ఖానాపూర్: ఖానాపూర్‌కు మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఉట్నూర్‌కు తరలించడాన్ని నిరసిస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన సమితి శనివారం తలపెట్టిన పట్టణ బంద్ సంపూర్ణంగా జరిగింది. పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. జిల్లా పరిషత్ బాలికల పాఠశాలతోపాటు, ఇతర పాఠశాలలను మూసివేయించేందుకు వెళ్లిన జేఏసీ నాయకులను సీఐ అజయ్‌తోపాటు ఎస్సై రాహుల్‌గైక్వాడ్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను అరెస్టు చేసి పోలీస్ ష్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, నాయకులకు మద్య వాగ్వాదం జరిగింది. కార్యక్రమంలో నాయకులు సాగి లక్ష్మణ్‌రావు, ఆకుల శ్రీనివాస్, కొండాడి గంగారావు, పుప్పాల గజేందర్, ఎనగందుల నారాయణ, కాశవేని ప్రణయ్, గౌరికార్ రాజు, ఇర్ఫాన్, నశీర్, ప్రణీత్, రాపెల్లి రవీందర్, బి.మురళికృష్ణ, మాదాసు మురళి, దివాకర్, మేస సతీశ్, జెట్టి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.