
నాణ్యమైన భోజనం పెట్టాలి
కుంటాల: విద్యార్థినులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని జిల్లా పంచాయ తీ అధికారి శ్రీనివాస్ సూచించారు. బుధవా రం మండలంలోని కల్లూరు కేజీబీవీని సందర్శించారు. విద్యార్థినులకు అందించే భోజనా న్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. డీఎల్పీవో సుదర్శన్, ఎంపీవో ఎంఏ రహీంఖాన్, సిబ్బంది ఉన్నారు.
పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష
మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో డీపీవో శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. వనమహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. ఎంపీడీవో వనజ, ఎంపీవో ఎంఏ రహీంఖాన్, ఏపీవో నవీన్, ఏపీఎం అశోక్, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.