
ప్రజల భద్రతే ధ్యేయం
● ఎస్పీ జానకీషర్మిల
కడెం: ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం పని చేయాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. కడెం ప్రాజెక్టును మంగళవారం పరిశీలించారు. నీటి మట్టం లోతట్టు ప్రాంతాల వివరాలను తెలుసుకున్నారు. విపత్తు వేళలో తక్షణమే స్పందించి సహా యక చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించా రు. భారీ వర్షాలు, వరదలు ఉంటే ప్రజలు పోలీ సుల సాయం తీసుకోవాలన్నారు. కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 లేదా, జిల్లా పోలీసు కంట్రోల్ రూం నంబర్ 8712659555కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అంతకుముందు కడెం ఠాణాను సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. గంజాయి నిర్మూలనపై దృష్టి సారించాలని, నేరాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అనంతరం స్టేషన్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసి ఎస్సై పి.సాయికిరణ్, సిబ్బందిని అభినందించారు.
నేడు భైంసాలో పోలీస్ ప్రజావాణి
భైంసాటౌన్: పట్టణంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రజావాణి నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్పీ జానకీషర్మిల కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అర్జీదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. భైంసా డివిజన్ పరిధిలోని ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.