
పులుల రక్షణతో జీవ వైవిధ్యం
నిర్మల్‌టౌన్: పులుల రక్షణతోనే పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్యం సాధ్యమని నిర్మల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామకృష్ణారావు అన్నారు. అంతర్జాతీ య పులుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో మంగళవారం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. సేవ్ టైగర్, సేవ్ వైల్డ్ లైఫ్ అనే ప్లకార్డులతో పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్‌రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ప్రకృతి పరిరక్షణలో పులు లు కీలకమన్నారు. అనంతరం పులుల సంరక్షణ, అడవుల రక్షణపై నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో, ఏవో, డిప్యూటీ రేంజర్ పాల్గొన్నారు.
అవగాహన ర్యాలీలో పాల్గొన్న అటవీ శాఖ సిబ్బంది