వాతావరణం
ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత కూడా తక్కువగా ఉంటుంది. సాయంత్రం అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉంది.
భూసమస్యల
పరిష్కారానికి భూభారతి
కుంటాల: భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టం రూపొందించిందని భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి తెలిపారు. మండలంలోని పెంచికల్‌పాడ్, దౌనెల్లి, అందాకూర్‌లో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మాట్లాడారు. గ్రామాల్లోని రైతుల సమస్యలు ఉంటే పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో 72 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ కమల్‌సింగ్ తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్లు కమల్ సింగ్, ఎజాజ్ అహ్మద్‌ఖాన్, ప్రవీణ్‌కుమార్, లింగమూర్తి, శ్రీకాంత్, డీటీ నరేశ్‌గౌడ్, ఆర్‌ఐలు అడెల్లు, రాజేశ్వర్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


