డీ 1 పట్టాలు రద్దుచేయాలి
సోన్ మండలంలోని సిద్దిలకుంటలో అక్రమ డీ 1 పట్టాలు రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. శ్రీరాంసాగర్ జలాశయం ముంపునకు గురైన గ్రామంలో భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వం 23 ఎకరాల మిగులు భూమిని కేటాయించగా కొందరు అక్రమంగా పట్టాలు సృష్టించి కబ్జా చేస్తున్నారన్నారు. 2022లో డీ 1 పట్టాను అప్పటి కలెక్టర్ రద్దు చేసినప్పటికీ మళ్లీ సాగు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. స్పందించిన కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడి పట్టాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. – కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన సిద్దలకుంట గ్రామస్తులు


