ద్విచక్రవాహనం దొంగ పట్టివేత
ముధోల్: మండల కేంద్రంలోని స్థానిక కాల్వగల్లీలో ద్విచక్రవాహనం దొంగతనం చేసిన వ్యక్తిని కాలనీవాసులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మండల కేంద్రంలోని కాల్వగల్లీలో ఉన్న హనుమాన్ ఆలయంలో హుండీ దొంగతనం చేసేందుకు దొంగ విఫలయత్నం చేశాడు. అనంతరం అదే గల్లీలో ఉన్న ద్విచక్రవాహనాన్ని దొంగిలించి వెళ్తుండగా కాలనీవాసులు పట్టుకున్నారు. ఎస్సై సంజీవ్‌కుమార్‌కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వారికి కాలనీవాసులు దొంగను అప్పగించారు. దొంగను బాసర మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


