
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
● మరొకరికి తీవ్రగాయాలు
జైనథ్: మండలంలోని భోరజ్ సమీపంలో సోమవారం రాత్రి ట్రాక్టర్‌ను కారు వెనుకనుంచి ఢీకొన్న ఘటనలో బాలుడు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిరాల గ్రామానికి చెందిన భోయర్ జగదీష్ పక్కింట్లోని ఛాయాబాయి, లక్ష్మణ్ దంపతుల కుమారుడు పవార్ కృష్ణ (11)తో కలిసి కారులో ఆదిలాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా భోరజ్–బేల జాతీయ రహదారిపై ఎరువుల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనక నుంచి ఢీకొన్నాడు. కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఘటనలో జగదీష్, కృష్ణకు తీవ్రగాయాలు కావడంతో 108లో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. కృష్ణ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మంగళవారం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. జగదీశ్ పరిస్థితి సైతం ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతుని తల్లి ఛాయాబాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.