కోటి ‘జైకోవ్‌–డి’ డోసులకు కేంద్రం ఆర్డర్‌

ZyCoV-D nears inclusion in vaccination drive as Centre orders 10 million doses - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌–19 మహమ్మారి నియంత్రణకు గాను 12 నుంచి 18 ఏళ్లలోపు వారి కోసం భారత్‌లో అనుమతి పొందిన తొలి టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్‌–డి వ్యాక్సిన్‌ కోటి డోసుల కొనుగోలుకు కేంద్రం ఆర్డర్‌ ఇచ్చినట్లు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ టీకాకు ఆగస్టు 20న డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి లభించింది. ఈ వ్యాక్సిన్‌ ఒక్కో డోస్‌కు పన్నులు మినహాయించి రూ.358 ఖర్చవుతుంది. తమవద్ద ఉన్న పరిమిత వనరుల నేపథ్యంలో ప్రతినెలా ఒక కోటి డోసులను మాత్రమే సరఫరా చేయగలమని జైడస్‌ క్యాడిలా సంస్థ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. కరోనా నియంత్రణ కోసం జైకోవ్‌–డి టీకాను మూడు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి డోస్‌ తర్వాత 28వ రోజు రెండో డోస్, 56వ రోజు మూడో డోస్‌ ఇవ్వాలి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top