సీసీబీ విచార‌ణ‌..ప‌లువురు సినీ న‌టుల‌కు స‌మ‌న్లు

Yuvraj, Son Of Former Congress MLA  RV Devaraj Reaches CCB  - Sakshi

బెంగళూరు : శాండ‌ల్‌వుడ్ డ్ర‌గ్స్ కేసులో ప‌లువురు సినీన‌టులు, రాజ‌కీయ‌నేతల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కేసు విచార‌ణ నిమిత్తం  మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఆర్‌కె దేవ‌రాజ్ కుమారుడు యువ‌రాజ్ శ‌నివారం సీసీబీ ( సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్) ఎదుట హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుత కాంగ్రెస్ కార్పోరేట‌ర్‌గా యువ‌రాజ్ విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ కేసులో క‌న్న‌డ సినీ న‌టులు అకుల్ బాలాజీ, సంతోష్ కుమార్‌ల‌కు సీసీబీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటివరకు  రాగిణి ద్వివేది, సంజన గల్రానీ, ఆర్టీఓ క్లర్క్ బి కె రవిశంకర్, రాహుల్ థోన్స్, నైజీరియా సైమన్ సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే.  (సంజన ఇంట్లో కీలక సాక్ష్యాలు)

ఈ కేసులో ప్ర‌ధాన  నిందితుడు లూమ్‌ పెప్పర్‌ సాంబాను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నడ సినిమారంగానికి చెందిన సెలబ్రిటీలకు తామే మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా . బెంగళూరుతో పాటు చుట్టు ప్రక్కల రిసార్ట్‌లో మధ్యరాత్రి వరకు జరిగే పార్టీలకు మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్ర‌ధానంగా ఏడుగురు రాజీక‌య‌నేత‌లు కూడా డ్ర‌గ్స్‌కేసులో ఉన్నట్లు సీసీబీ అధికారుల వ‌ద్దా ప‌క్కా స‌మాచారం ఉంది. వీరిలో కాంగ్రెస్‌ మాజీ మంత్రి, దివంగత జీవరాజ్‌ ఆళ్వా పుత్రుడు ఆదిత్య ఆళ్వా  నివాసంపై సీసీబీ పోలీసులు మంగళవారం దాడి చేశారు. బెంగళూరు హెబ్బాళలోని హౌస్‌ ఆఫ్‌ లైఫ్‌ రిసార్ట్, ఇంటిలో సోదాలు జరిపారు. డ్రగ్స్‌ కేసు వెలుగుచూసినప్పటి నుంచీ ఆదిత్య అదృశ్యమయ్యాడు. (డ్రగ్స్‌ కేసు: విస్తరిస్తున్న మత్తు ఉచ్చు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top