డ్రగ్స్‌ కేసులో సినీనిర్మాత అరెస్ట్

Drugs Case Of Sandalwood Producer Shankar Gowda Arrested - Sakshi

యశవంతపుర/కర్ణాటక: డ్రగ్స్‌ కేసుకు సంబంధించి విచారణను ముమ్మరం చేసి గోవిందపుర పోలీసులు  సినీ నిర్మాత శంకర్‌గౌడను అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ ప్రకాశ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం శంకరగౌడ ఆఫీసు, ఇంటిపై దాడి చేసి సోదాలు చేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్, కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరిని అదుపులోకి తీసుకొని వీకెండ్‌లో నిర్వహించే పార్టీలకు ఎవరెవరు వచ్చారనే వివరాలు రాబట్టినట్లు తెలిసింది.  

కాగా కర్ణాటకలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో విచారణకు రావాలంటూ టాలీవుడ్‌ హీరో తనీష్‌కు కూడా ఇటీవల బెంగుళూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అతడితో పాటు మరో ఐదుగురికి పోలీసులు అప్పట్లో సమన్లు జారీ చేశారు. వీరిలో ప్రముఖ నిర్మాత శంకర్‌ గౌడ కూడా ఉన్నాడు. శంకర్‌ గౌడ ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొన్న పలువురు సెలబట్రీలకు నోటీసులు పంపినట్లు బెంగుళూరు పోలీసులు తెలిపారు.

చదవండి: అక్కడ పార్టీకి వెళ్లింది నిజమే కానీ.. : తనీష్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top