ఆ ఘటన మహిళలకు తీవ్ర అవమానకరం.. ఎన్‌సీడబ్ల్యూ తీవ్ర అభ్యంతరం

Womens Panel NCW Condemns Sleeve Cutting Act Outside - Sakshi

న్యూఢిల్లీ: రాజస్తాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ పరీక్ష సందర్భంగా బికనీర్‌ జిల్లాలోని ఓ కేంద్రం బయట మహిళా అభ్యర్థి ధరించిన టాప్‌ పొడుగు చేతులను పురుష సిబ్బంది ఒకరు కత్తిరించడంపై జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు మహిళలను ఘోరంగా అవమానించడమేనని పేర్కొంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

పరీక్ష కేంద్రం వద్ద మహిళా అభ్యర్థుల సోదా కోసం ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించకపోవడంపై వివరణ అడిగింది. పరీక్షా కేంద్రం వద్ద ఒక అభ్యర్థిని ధరించిన పొడుగు చేతుల టాప్‌ను పురుష గార్డు కత్తెరతో కట్‌ చేస్తున్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.
(చదవండి: Odisha: ‘ఇక్కడ ఏ వాహనం లేదు’. బైక్‌పైనే మృతదేహం తరలింపు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top